
సాక్షి డిజిటల్ న్యూస్ గంగారం నవంబర్ 8 :-మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో శుక్రవారం సాయంత్రం సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గంగారం మండలం పరిధిలోని బూర్కావాని గుంపు వద్ద ఉన్న ప్రధాన రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో రెండు బైకులపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.బాధితులది గుండాల మండలం,గలభ గ్రామానికి చెందిన దానసరి గణేష్ మరియు రవి గా గుర్తించారు.మరో ద్విచక్ర వాహనదారుడు మాణిక్యారంకు చెందిన వ్యక్తిగా తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎస్సై రవికుమార్ స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో వెంటనే గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.