సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 07, మల్లాపూర్ మండల రిపోర్టర్, ఆకుతోట నర్సయ్య : జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థి సారా రుత్విక్ గౌడ్ ఇటీవల రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అతనికి గౌడ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు ముద్దం శరత్ గౌడ్, ఉపాధ్యక్షులు బండి లింగస్వామి గౌడ్ లు ప్రోత్సాహకంగా ట్రాక్ షూట్ మరియు నెట్టు, అలాగే మహ్మద్ రఫీ షూస్ అందించారు. ఈ కార్యక్రమంలో ముద్దం సత్యనారాయణ గౌడ్, పెరుమళ్ళ రాజేందర్ గౌడ్, గొట్టిపాడ్త రమేష్ గౌడ్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు