రాజీవ్ విద్యా దీవెన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ని వినియోగించుకోండి – తిమ్మిడి నాగరాజు

★ఎస్సీ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సకాలంలో దరఖాస్తు చేసుకొని, వినియోగించుకోవాలి.

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ జగన్ : నవంబర్ 7, ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అందించే రాజీవ్ విద్యా దీవెన ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. తిమ్మిడి నాగరాజు కోరారు. మండల కేంద్రమైన వేంసూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శుక్రవారం నాడు ఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. తిమ్మిడి నాగరాజు ప్రధానోపాధ్యాయులుతొ కలసి ఈ పథకానికి సంబంధించి న కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9, 10 వ తరగతి చదివే బాల బాలికలందరికీ రాజీవ్ విద్యా దీవెన పధకం కింద 3500 రూపాయలను ప్రభుత్వం స్కాలర్షిప్ రూపంలో అందిస్తుందని అన్నారు. అదేవిదంగా ఎస్సీ విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని సకాలంలో దరఖాస్తు చేసుకొని, వినియోగించుకోవాలని కోరారు. అనంతరం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. తిమ్మిడి నాగరాజు మాట్లాడుతూ మండలంలోని అర్హులైన ప్రతి ఎస్సీ విద్యార్థుల తల్లితండ్రులు ఈ సదవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు. అలాగే సరియైన ధ్రువపత్రాలు (ఆధార్, కులం, ఆదాయం, బోనోఫైడ్ సర్టిఫికెట్, పాస్ ఫోటో, ఆధార్ కార్డుతొ లింక్ అయిన బ్యాంకు ఖాతా) దగ్గరలోని మీసేవ, ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.