సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 రామకుప్పం రిపోర్టర్ జయరామిరెడ్డి చిత్తూరు జిల్లా ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు పెంచి పర్యావరణాన్ని పెంపొందించాలని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకటరమణ ప్రధాన కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు శుక్రవారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణాన్ని పెంపొందించుతూ మానవ మనుగుడా సాధించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల నాటి సంరక్షించాలని సూచించారు ముఖ్యంగా పాఠశాల ఆవరణ మరియు నివాసాల వద్ద ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ చేపట్టాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం ధనుంజయులు పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీరాములు నేతలు మురళీధర్ ఆదిల్ సుబ్రహ్మణ్యం బాలు తదితరులు పాల్గొన్నారు