బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన సదస్సు

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు: దళిత బహుజన్ రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సి) సేవా సంస్థ ఆధ్వర్యంలో కాట్రేనికోనలోని రామస్వామితోటలో ప్రజలకు శుక్రవారం బాల్యవివాహాలు, పారిశుద్ధ్యం పై అవగాహన సదస్సు నిర్వహించారు. సర్పంచి గంటి సుధాకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ అవగాహన సమావేశంలో సంస్థ సభ్యులు శామ్యూల్ అనిల్ కుమార్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 18 ఏళ్ల లోపు బాలికలకు పెళ్లిళ్లు చేయరాదన్నారు. బాల్య వివాహాలు చేయడం వల్ల బాలికలు అనేక అనారోగ్య సమస్యల బారిన పడటంతో పాటు పుట్టే పిల్లలకు సైతం జన్యుపరమైన ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. బాల్యవివాహాలపై ప్రతి ఒక్కరూ పునరా ఆలోచన చేయాలన్నారు. ఇళ్ల పరిసరాలలో పరిశుభ్రమైన వాతావరణం ఉంచుకోవాలన్నారు. కాల కృత్యాలు తర్వాత, భోజనానికి ముందు తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలి అన్నారు. స్వచ్ఛమైన తాగునీరు తాగినప్పుడే సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని వివరించారు. శ్రీను, నల్ల హరికిశోర్, నల్లా రాంబాబు , గిడ్ల శ్రీనివాస్, ఎ.శ్రీనుబాబు, మహిళలు పాల్గొన్నారు.