ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు నందు వందేమాతరం గేయాన్ని గీతాలాపన చేసిన అటవీశాఖ అధికారులు

సాక్షి డిజిటల్ ప్రతినిధి కొండ అవినాష్ 07 నవంబర్ 2025 : అటవీ శాఖ ఆధ్వర్యంలో వందేమాతరం గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేమాతరం గీతం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు మధిర నందు గీతాలపన చేయనైనది. ఈ సందర్భంగా మాట్లాడుతూ. బంకీ చంద్ర చటర్జీ బెంగలు సాహిత్యానికి, భారత జాతీయోద్యమానికి ప్రధానంగా గుర్తింపు పొందిన రచయి ఆయన రచించిన “ఆనందమఠ్” నవలలో ఉన్న “వందేమాతరం” పాట భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో సమర శంఖంగా మారింది.ఇంతటి పాత్రధారి యొక్క రచన జాతీయ గేయంగా గుర్తింపు పొంది, ఇంకా 150 ఏళ్ళ తర్వాతా దేశ భక్తి స్ఫూర్తిని అందించినది ఈ విధముగా ఈ ఒక్క కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎన్ వెంకట్ లక్ష్మి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సురేష్, పకిరయ్య, ఎఫ్ బి ఓ లు విజయ్ కుమార్, రాజేందర్, రమేష్ ,లింగేశ్వర్, సత్య కృష్ణ, లలిత, సూరిబాబు, జూనియర్ అసిస్టెంట్ షఫీవుద్దీన్, డి ఈ ఓ రాజు పాల్గొన్నారు