ప్రైవేటు స్కూల్లో బస్సులతో నిత్యం ఉదయము సాయంత్రం రోడ్డుపై కి వెళ్లడం కష్టంగా మారింది

*ఒకే రోడ్డు సరిగా లేక ఎన్నో ఇబ్బందులు

సాక్షి డిజిటల్ న్యూస్ మేడ్చల్ తేదీ : 07/11/2025 రిపోర్టర్ :ఎల్ విజయ్ కుమార్ విశ్లేషణ: రాఘవేంద్ర కాలనీ శ్రీ బాలాజీ నగర్ మర్రి రాజిరెడ్డి కాలనీ చంద్రానగర్ వెంకట్రామయ్య కాలనీ కేఎల్ఆర్ పేస్టు 2 కాలనీలలో నిత్యము బస్సులు ఉదయము సాయంత్రము పిల్లలను తీసుకపోవడానికి వీధుల్లోకి ప్రైవేటు యాజమాన్యం బస్సులు రోడ్డుపై నడుస్తుంటే ఇష్టానుసారంగా బస్సులు ఆపడం ప్రజలకు ఇబ్బందికరంగా మారడం జరిగింది ఓ నాలుగైదు కాలనీలకు 10 స్కూల్లో బస్సులు రావడం పిల్లలను దించడం పోవడం రోడ్డు రద్దీగా మారి చిన్న చిన్న యాక్సిడెంట్ జరగడం నిత్యము ఇలాగే జరుగుతూ ఉంటాయి . దీన్ని పట్టించుకునే వారే లేరా డ్రైవర్లు వాళ్ల ఫిట్నెస్ వారి లైసెన్స్ వెహికల్ ఫిట్నెస్ అలాగే వాళ్ళు నడుపు విధానము కాలనీలలో మెల్లగా నడపాలని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా రాశిగా నడుపుతున్న డ్రైవర్లు విద్య ప్రైవేటు విద్యాసంస్థల కు యాజమాన్యాలకు పత్రిక ముఖముగా విన్నవించుకోవడం ఏమనగా మీరు అందిస్తున్న సర్వీసులలో ఊరికే కాదు డబ్బులు తీసుకుని చేస్తున్నారు కానీ అదే మాదిరి ఫిట్నెస్ ఉన్న బస్సులను మంచి డ్రైవర్లను నడిపే విధానాన్ని మీరు మార్చుకోండి ఎందుకంటే అసలే కెఎన్ఆర్ కమాండ్ టు నేషనల్ హైవే రోడ్డు వరకు రోడ్డు పొడవుగా ఎన్ని గుంతలు ఉన్నాయో పెద్ద పెద్దవి ముఖ్యంగా మేడ్చల్ నగర పంచాయతీ పరిధిలో కోర్టు వద్ద కోర్టుకు వచ్చి పోయే వారి కార్లు ఇంకా ఎక్కువ అయినాయి అయినా గాని కోర్టు ఉన్న రోడే అలా ఉంటే ఇంకా మరి వేరే రోడ్ల పరిస్థితి ఎలా ఉండాలి అసలే అది మెయిన్ రోడ్డు చిన్న చిన్న కాలనీలలో చిన్న చిన్న బస్సులు టర్నింగ్ చేసుకోలేకపోతున్నాయి ముందుకు వెనకకు జరుపుకొని మూలలు మలుపు కొని అప్పుడు బస్సు తీయడం జరుగుతుంది చిన్న చిన్న వీధులలో బస్సుల డ్రైవర్లకు అవగాహన కల్పించాలని యాజమాన్యానికి విన్నవించుకుంటున్నాము ఇదే కనుక ఇలాగే జరిగితే మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మీపై చర్యలు తీసుకోమని మేము ప్రభుత్వాన్ని కోరుతాము అందుకే ముందుగా మీకు విన్నవించు కోవడం ఏమనగా మీ డ్రైవర్లను కాలనీలలో చూసి నడిపించమని వాళ్ళని ఉదయము సాయంత్రం ఓర్పుతో నడిపించమని ఎవరికీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలని యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తూ డ్రైవర్లకు హెచ్చరిస్తున్నాము

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *