
సాక్షి డిజిటల్ న్యూస్,నవంబర్ 07,రామన్నపేట మండలం రిపోర్టర్,శ్యామల నాగరాజు వంశరాజ్: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల ఆధారంగా జాతీయ గేయమైన వందేమాతరం గీతాన్ని భకించంద్ర చటర్జీ వ్రాసి 150 సంవత్సరాలు పూర్తి ఆయిన సందర్భంగా ఘన నివాళులర్పిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల శుక్రవారం నాడు ఉదయం 10గంటలకు, ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,యూనిట్ 2 ల ఆధ్వర్యంలో జాతీయ గేయమైన వందేమాతరాన్ని ఆలపించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రహత్ ఖానం,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి వెంకటేశ్వరరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు మిర్యాల అనిత,తాటిశెట్టి శ్రీనివాసులు, డాక్టర్ చిన్నబాబు, డాక్టర్ రత్నమంజుల, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య,డాక్టర్ డి కిషన్ ,డాక్టర్ సునిత, డాక్టర్ వెంకట్ గౌడ్,డాక్టర్ బ్రహ్మం,డాక్టర్ రాచమల్ల శ్రీను, డాక్టర్ రవీందర్ రావు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.