పెద్దింపేట గ్రామ ప్రజలు తాగు నీటి కోసం ఆందోళన

*ఎంపీడీవో fc,ఏవో, ఈవోపీఆర్డిఎఫ్, పంచాయతీ సెక్రెటరీ ఇచ్చిన హామీ అమలు చేయాలి, కాళీ బిందెలతో నిరసన

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 బలిజపేట రిపోర్టర్ సి హెచ్ మురళి : ఈరోజు పెద్దింపేట గ్రామంలో సంవత్సరాల తరబడి త్రాగునీరు సమస్య పరిష్కారరిచాలి, ట్యాంకు నిర్మించి ఇంటింటికి కళాయిలు వేయాలని, పెద్దింపేట గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 7 నా కాళీబిందెలతో నిరసన ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు రెడ్డి వేణు, శాఖ కార్యదర్శి వెన్నెల వేణు మాట్లాడుతూ మన నియోజకవర్గం శాసనసభ్యులు బోనె ల విజయ్ చంద్ర గారు కి కూటమి ప్రభుత్వం కీ విన్నపం బలిజిపేట మండలం పెద్దింపేట గ్రామంలో బోర్లు ఉన్న శుభ్రమైన నీరు కాదు. త్రాగడానికి మంచి నీరు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు, మంచినీరు అందజేయాలని గ్రామంలో ఇంటింటికి సంతకాల సేకరణ చేసి అక్టోబర్ 18వ తేదీన బలిజిపేట మండల అభివృద్ధి కార్యాలయం దగ్గర నిరసన, ధర్నా గాతెలియజేస్తే నిరసన దగ్గరికి ఎంపీడీవో, ఏవో, ఈవోపీఆర్డి, పంచాయతీ సెక్రటరీలు వచ్చి వారం రోజులో త్రాగునీరు సమస్య పరిష్కారం చేస్తామని పామాయిల్ తోటలో మంచినీరు ఉన్న రైతుతో మాట్లాడి అక్కడి నుండి పైప్ లు వేసి గ్రామములో ట్యాంకు కట్టి త్రాగునీరు అందిస్తామని చెప్పారు నేటికీ రెండు వారాలు అవుతున్న అధికారులు త్రాగునీరు సమస్య పరిష్కారం చేసే విధంగా ఆలోచన చేయకపోవడం ప్రయత్నం లేకపోవడం చాలా దారుణం, నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి మంచినీళ్లు సమస్య పరిష్కారం చేయాలి అని కోరారు,ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు యమ్మల మన్మధరావు మాట్లాడుతూ గ్రామంలోకలుషిత నీరు తాగుతున్నారు. అనారోగ్యాలకు గురౌతున్నారు. ఊరు కి దూరంగా పామాయిల్ తోటలో ఉన్న రైతు బోరు నుండి నీరు తెచ్చుకుంటున్న పరిస్థితి, ఇప్పుడు కూడా ఆ రైతు నీరు కురానివ్వడం లేదు పెద్దింపేట గ్రామంలో ఉన్న ఎనిమిది చేతి పంపు బోర్ల నుండి నీరు త్రాగడానికి పనికిరాదు, కలుషితం , ఉప్పు నీరు వహిస్తుంది. గతంలో రక్షిత మంచినీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది నిధులు వచ్చాయి,వాటర్ స్కీమ్ డెవలప్మెంట్ ద్వారా ఈ నిధులు దుర్వినియోగం చేశారు. గౌరీపురం సువర్ణముఖి నది నుండి పెద్దింపేట వరకు పైపులైన్లు వేసి విడిచి పెట్టారు తప్ప మంచినీళ్లు ట్యాంకు కట్టలేదు. నిధులు దుర్వినియోగం చేశారు,పెద్దింపేటలో ఇంటింటి కుళాయిలు కొంతమందికి మాత్రమే వేశారు నీరు మాత్రం లేదు. ఈ నిధుల దుర్వినియోగం పైన ప్రభుత్వం వారు దర్యాప్తు చేసి తీవ్రమైన చర్యలు చేపట్టాలని కోరుతూ పంచాయతీ ఆఫీస్ దగ్గర బోరు నుండి నీరు తాగడానికి పనికిరాదు కావున తక్షణమే ప్రభుత్వం నిధులు ఇచ్చి మంచిగా తాగేనీరు వచ్చిన చోటబోరు వేసి, ట్యాంకు కట్టి ప్రభుత్వం మంచినీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పది రోజుల్లో పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు కానీపరిష్కారం కాలేదు అన్నారు. ఈ నిరసనతో ప్రభుత్వం దిగువచ్చే పరిష్కారానికి చర్యలు లేనిచో బిందెలతో చలో కలెక్టరేట్ ఆందోళన చేపట్టడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో వెన్నెల కృష్ణ, బంతిని, గౌరీశ్వరరావు, మజ్జి దుర్గారావు, రాములమ్మ, సీతారావమ్మ ,లక్ష్మమ్మ, ఈశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *