పాఠశాల అభివృద్ధిపై అధికారులతో సమీక్ష

సాక్షి డిజిటల్ న్యూస్ 7 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు : మండలంలోని ఏ.కొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి పనులపై అధికారులతో స్థానిక సర్పంచ్ చింతల సత్య వెంకటరమణ సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాల సమస్యలపై జడ్పిటిసి కర్రీ సత్యం ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై స్పందించిన అధికారులు శుక్రవారం పాఠశాలలో నెలకొన్న సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, అదనపు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన ఏర్పాట్లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు మండల విద్యాశాఖ అధికారి వి. ఉషారాణి తదితరులు ఉన్నారు.