తహశీల్దార్ మణిధర్ ఆధ్వర్యంలో వందేమాతరం గీత ఆలాపన

సాక్షి డిజిటల్ న్యూస్ పినపాక ప్రతినిధి నవంబర్ 7 : అశ్వాపురం మండల కేంద్రంలో గల ఎమ్మార్వో కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తహసీల్దార్ మణిధర్ ఆధ్వర్యంలో గీత ఆలాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1875 నవంబర్ 7న ఈ గీతాన్ని బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించారు అని అన్నారు, ఇది దేశ భక్తికిమాతృభూమిపై ప్రేమకు ప్రతిక అన్నారు.వందేమాతర గీతం భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఉత్తేజపరిచింది, విప్లవకారుల కు స్ఫూర్తినిచ్చింది , బ్రిటీష్ సామ్రాజ్యం కూల్చి వేయటానికి సహాయపడింది. ఈ గీతం భాష,ప్రాంతం,కులం,మతం వంటి విభేదాలను అధిగమించి ప్రజలందరి ఏకం చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *