(సాక్షి డిజిటల్ న్యూస్ )తల్లాడ/నవంబర్ 07 ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీ యు సి ఐ )ఖమ్మం జిల్లా రాజకీయ తరగతులు నవంబర్ 9వ తేదీన నేలకొండపల్లి మండల కేంద్రంలో వందమందితో నిర్వహించడం జరుగుతుందని, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టి యు సి ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఏ వెంకన్నతెలిపారు. శుక్రవారం తల్లాడ పట్టణంలో తల్లాడ ఏన్కూర్ ఏరియా కమిటీ సమావేశంలో వారు పాల్గొని ప్రసంగిస్తూప్రస్తుత రాజకీయ పరిస్థితులు కార్మిక వర్గ కర్తవ్యాలు అంశాన్నిటి యు సి ఐ రాష్ట్ర అధ్యక్షులు కేసూర్యం, “భారత కార్మికొద్యమ చరిత్ర” అంశాన్ని రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎల్ పద్మ, టియుసిఐ నిర్మాణం పని విధానం అంశాన్ని జిల్లా కార్యదర్శి జి రామయ్య బోధిస్తారని వారు తెలిపారుకార్మిక వ్యతిరేక యాజమాన్య అనుకూలమైన నాలుగు లేబర్ కోట్లను పార్లమెంట్లో ఆర్డినెన్స్ గా ఆమోదించడం వలన తెలంగాణ రాష్ట్రంలో కార్మికులకు 10 గంటల పని విధానం అమలు వలన కట్టు బానిసలుగా పనిచేయాల్సి వస్తుందని కనుక తక్షణమే పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేబర్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 12న వెంటనేఉపసంహరించుకోవాలని దీనివలన కార్మికులకు వచ్చే ఇన్సూరెన్స్ ను కోత విధించడం పూర్తిగా నిరాకరించడం జరుగుతుందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాడాలని వారు పిలుపునిచ్చారు.ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు జీవో ప్రకారం కాకుండా కాంట్రాక్ట్ ర్స్ ఇష్టం వచ్చినట్లుగా కార్మికులకు వేతనాలు ఇవ్వడం జరుగుతుందని వారు అన్నారు. ఈ సమావేశం లో జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా తల్లాడ ఏన్కూర్ ఏరియా కమిటీ అధ్యక్షులు పటాన్ నాగుల మీరా కార్యదర్శి డి శ్రీనివాసరావు కార్యవర్గ సభ్యులు డి రమణ ఈ సత్యం సిహెచ్ రాఘవ బడే మియా రాఘవరావు నరేష్ ప్రవీణ్ శ్రీనురమేష్రంగారావు తదితరులు పాల్గొన్నారు