జనావాస మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయదని జిల్లా రెవిన్యూ అధికారిని, జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ కు వినతి పత్రం అందచేత

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 08 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో జనావాసాల మధ్య మద్యం దుకాణాలు (వైన్స్ షాపులు) ఏర్పాటు చేయవద్దని జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారికి, జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ గార్లకు వినతి పత్రాన్ని మోత్కూరు మున్సిపాలిటీ కి చెందిన వివిధ పార్టీల నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ట్రాఫిక్ సమస్యలు, తాగిన మైకంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, విద్యాలయాలకు వెళ్ళే విద్యార్థుల ను వేధిస్తూ, కళాశాలకు వెళ్లే దారిలో ఉండడం వల్ల విద్యార్థులు మద్యానికి బానిస అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండగోని రామచంద్ర గౌడ్, కలిమెల నర్సయ్యా, బుర్ర శ్రీను, సురేష్ మందుల, ఎడ్ల నరేశ్, గుండు శ్రీను, బీసు మధు, ఉప్పలయ్య, శేఖర చారి తదితరులు పాల్గొన్నారు.