సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్07, జి.మాడుగుల: మండల కేంద్రమైన జి.మాడుగులలో కిముడు కోటేశ్వరరావు, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు కిముడు శివ రామ్ కుమార్, హేమలతల కళ్యాణ మహోత్సవం శుక్రవారం గిరిజన సాంప్రదాయ బద్ధంగా జరిగింది .గ్రామంలో గల గిరిజన పూజారులు శివందొర, కొండందొరలు నిర్ణయించిన ముహూర్తం, వేద పండితుల మేరకు గ్రామంలో గల ముందుగా శంకు దేవుడు పూజలు నిర్వహించి తర్వాత మత్స్య మడుగులమ్మ ఆలయం,రామాలయం, పోతురాజు దేవుడు ఆలయంలో పెళ్ళికొడుకు శివ రామ్ కుమార్ తో పూజలు జరిపించారు. వేరే గ్రామంలో ఉన్న పెళ్లికూతురు హేమలత తీసుకురావడానికి గిరిజన సాంప్రదాయ ప్రకారం కాత 36మూటలు పేడ, పలకర్ర, వెండి, బంగారం సున్నం, ఎర్రమట్టి, నల్లరంగు, స్నానానికి సబ్బు, బొట్టు, కాటుక, ఫెయిర్ అండ్ లవ్లీ, 36జతలు అరిసెలు, మేకపోతు చిల్లర పైసలు, వివిధ గిరిజన సాంప్రదాయ సామగ్రి తో రెండు కాత పెట్టెలు (వెదురు పెట్లు) పెళ్ళికొడుకు ఇంటి నుండి ముత్తైదువులు పేరంటాలతో పెళ్లికూతురు ఇంటికి పంపించారు. ఇరు వర్గాల బంధువులు కుటుంబీకులు బంధువులు కలిసి అంగరంగ వైభవంగా శివ రామ్ కుమార్, హేమలత కళ్యాణ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వైఎస్ఆర్సిపి పాడేరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు మత్స్యరాస వెంకట గంగరాజు మండల టిడిపి నాయకుడు మత్స్యరాస రామరాజు గిడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు