సాక్షి డిజిటల్ న్యూస్ పినపాక ప్రతినిధి నవంబర్7 సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ కామ్రేడ్ పెదగొని ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగింది, డివిజన్ నాయకులు పావురాల లాలయ్య జెండాను ఎగరవేశారు, అనంతరం సిపిఐ ఎంఎల్ సీనియర్ నాయకులు కామ్రేడ్ జగ్గన్న, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ముసలి సతీష్ మాట్లాడుతూ ప్రతిఘటన పోరాట తొలి అమరులు బత్తుల వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, బిజ్జా వెంకన్న ల(గొందిగూడెం అమరవీరులు ) స్తూపం దగ్గర ఈ సభ జరిగినది. చండ్ర పుల్లారెడ్డి గారి నాయకత్వన ఏర్పడిన తొలి దళంఫై పోలీసులు తప్పుడు సమాచారంతో ఈ దళంపై ప్రజలను ఉసిగొలిపి, దాడి చేయించి పట్టుకున్నారు. ఆ తర్వాత పోలీసులు చిత్రహింసలు పెట్టి ఈ కామ్రేడ్స్ ను బూటకపుఎన్కౌంటర్లో కాల్చి చంపారు అని అన్నారు,ఈ తొలి అమరవీరులను స్మరిస్తూ పగిడేరు గ్రామస్తుడైన కామ్రేడ్ జగ్గన్న సుదీర్ఘకాలం కామ్రేడ్ దళం లో నాయకుడిగా పని చేశాడు అని అన్నారు, ఆనాటి త్యాగాల గురించి అమరవీరుల చరిత్ర గురించి వివరించాడు, జగ్గన్న సహజరి కామ్రేడ్ లక్ష్మక్క, ఇస్తారి ఎన్కౌంటర్ హత్యకు గురైనారు అని ఆయన అన్నారు, మొండికుంట జాన్ రెడ్డి రంగవల్లితో ఎన్కౌంటర్ హత్యకు గురి అయ్యాడని అమరవీరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేశారు, నేడు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, కార్పొరేట్లకు వ్యతిరేకంగా బలమైన ప్రజా ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఉందని నాయకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు మెస్ గోపాల్, బత్తిని సత్యం, పిఓడబ్ల్యూ డివిజన్ అధ్యక్షురాలు కొడిమ రాధ,న్యూడెమోక్రసీ డివిజన్ నాయకులు YS రెడ్డి తెల్లoవెంకటమ్మ,. కనతాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.