సాక్షిడిజిటల్ న్యూస్, నవంబర్ 08,రాయికల్,వై. కిరణ్ బాబు:- జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని వీధి కుక్కల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకి గురవుతూ ప్రాణభయంతో ఆందోళన చెందుతున్నారు. రోజురోజుకి కుక్కలు వేల సంఖ్యలో పెరగడం వలన పాదచారులను ముఖ్యంగా చిన్నపిల్లలను ఇటీవల పట్టణంలోని వివిధ వార్డులలో 35 మందికి పైగా కుక్క కాటుకు గురి అయినారు. ఈ కుక్కల వలన రేబిస్ వ్యాధులు సోకి పట్టణ ప్రజలు హాస్పిటల్ బాట పట్టాల్సి వస్తోందని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన స్పందించకపోగా అధికారుల అలసత్వంతో పట్టణంలోని సమస్యలు ఎక్కడికి అక్కడే ఉన్నాయని ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతున్నారని మున్సిపల్ అధికారులకి విన్నవించినా స్పందన లేదని అధికార పార్టీ నిర్లక్ష్యంతో ప్రజలకు రక్షణ లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలనను గాలికి వదిలేయడంతో మున్సిపల్ అధికారుల అవగాహన లేమితో ప్రజల సమస్యలు ఎక్కడికి అక్కడే ఉన్నాయని పట్టణంలోని వివిధ వార్డుల సమస్యలను మున్సిపల్ అధికారుల ముందు ఉంచి భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మున్సిపల్ ఆఫీస్ ముందు జగిత్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. ఇట్టి కార్య్రమంలో రాయికల్ పట్టణ బీజేపి అధ్యక్షులు కుర్మ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శులు కునారపు భూమేష్, బన్న సంజీవ్, ఉపాధ్యక్షులు ఎల్లాగౌడ్, అల్లె నర్సయ్య, బీజేపి నాయకులు కల్లెడ ధర్మపురి, సామల్ల సతీష్, బొడుగం శ్రీకాంత్, దాసరి రవి, అందె శంకర్, బూర్ల గోపి, శ్రీగద్దే సుమన్, మచ్చ శంకర్, మచ్చ గంగరాజం, వాసం నర్సయ్య, మామిడాల రాజేష్, కాయితి గంగాధర్, లచ్చన్న, పరాంకుశం వెంకటాద్రి, తాటిపాముల రాజశేఖర్, సాయి కుమార్,ఐటి సెల్ కన్వీనర్ కట్కం కిషోర్, కార్యకర్తలు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొనటం జరిగింది.