12న జరిగే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలి

సాక్షి డిజిటల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రాము నాయక్ (నవంబర్ :7) సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో ఈనెల 12న కొత్తగూడెం క్లబ్లో జరిగే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఈ జాబ్ మేళా ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హాజరు కానున్నారని ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జాబ్ మేళా సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ సంస్థ సౌజన్యంతో కొత్తగూడెం కేంద్రంగా జరిగే ఈ జాబ్ మేళాకు 50కి పైగా కంపెనీలు హాజరవుతున్నాయని చెప్పారు. జిల్లా నలు మూలల నుండి 10వేల మందికి పైగా హాజరయ్యేలా జిల్లాలో ఉన్న అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. మూడు వేలకు పైగా ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహిస్తున్న జాబ్మేళా నిరుద్యోగల పాలిట వరంగా మారుతుందని ఆర్ధికంగా స్థిరపడేందుకు అవకాశం ఉంటుందన్నారు. 10వ తరగతి పాస్ అయిన వారి నుండి మొదలుకుని ఐటిఐ డిప్లొమా ఫార్మసీ ఎంబిఏ ఎంసిఓ గ్రాడ్యూయేషన్ పోస్టుగ్రాడ్యుయేట్ బిఇ బిటెక్ ఎంటెక్ తదితర చదువులు చదివిన వారంతా ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందేందుకు హాజరుకావచ్చని చెప్పారు. కనీసం రూ.13 వేల నుండి మొదలుకుని రూ.10 లక్షల వరకు నెల ప్యాకేజీతో జీతాలు వచ్చే అవకాశం ఉందని దిగ్గజ సాఫ్ట్వేర్ ఫార్మసీ కంపెనీలతో పాటు పలు కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. జాబ్ మేళాకు హాజరయ్యేందుకు ముందుగా రిజిస్ట్రేన్ చేయించుకోవాల్సి ఉంటుందని క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఉందని ఎం ఎల్ ఏ చెప్పారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వీలుకాని వారు కూడా నేరుగా హాజరై స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకుని జాబ్మేళాలో పాల్గొనవచ్చని ఒక్కొక్క అభ్యర్థి కనీసం 5 కం పెనీలు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు అయ్యే విధంగా టోకెన్ పాస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఉద్యోగానికి అభ్యర్థులు ఎంపికైన వెంటనే అక్కడికక్కడే ఆయా కంపెనీలు ఉద్యోగం కల్పిస్తున్నట్లు ఒప్పంద పత్రాలను కూడా ప్రముఖల చేతుల మీదుగా అందిస్తారని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ జాబ్మేళాలో జిల్లాలోని 40 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులు ఇందుకు సంబంధించి ఓ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలన్నారు. అనంతరం జాబ్ మేళా ప్రచార పోస్టర్ను విడుదల చేశారు. తహశిల్దార్ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మురళీధర్ సింగరేణి ఎసీ-2 జిఎం కోటిరెడ్డి ఏజిఎం (సివిల్) రామకృష్ణ, డిజిఎం (పర్సనల్) మోహన్ రావు ఎస్టేట్ ఆఫీసర్ తావుర్య జాబ్ మేళా కో-ఆర్డినేటర్ చందర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన ఆర్డిఓ మధు కార్పోరేషన్ కమీషనర్ సుజాత డిఎస్పి రెహమాన్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాపా గుర్తింపు సంఘం నాయకులు వట్టికొండ మల్లిఖార్జునరావు, నాయకులు కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళీ సలిగంటి శ్రీనివాస్ చంద్రగిరి శ్రీనివాసరావు జి వీరస్వామి తహశిల్దార్లు ఎంపిడిఓలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.