సాక్షి డిజిటల్ న్యూస్:7 నవంబర్,పాల్వంచ. రిపోర్టర్:కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.సింగరేణి జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రగ్స్,సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమంకు కొత్తగూడెం డీఎస్పీ. రెహమాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ,రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయలు ఎవరు ఇవ్వరని సూచించారు.ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని, థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేసుకోవద్దు అని,పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం,ఎపికే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దు అని సూచించారు