సాక్షి, డిజిటల్ న్యూస్, నవంబర్ 7, శంకరపట్నం (శ్రీరాంపూర్ మంచిర్యాల జిల్లా) సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆర్కే ఫైవ్ ఫిట్ సెక్రెటరీ గునిగంటి నర్సింగరావు హెచ్చరించారు, గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే ఫైవ్ గని ఆవరణంలో ఏఐటీయూసీ నాయకులు కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా ఫిట్ సెక్రెటరీ నర్సింగరావు మాట్లాడుతూ కార్మికులకు సంబంధించిన డిమాండ్లను యజమాన్యం పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, పది డిమాండ్లతో కూడిన సమస్యలను ఆయన చదివి కార్మికులకు వినిపించారు, సింగరేణి యాజమాన్యం ఈ డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు, గతం మాదిరిగానే మెడికల్ బోర్డు నిర్వహించాలన్నారు, ఏడాదికి 150 మాస్టర్ లకు జారీ చేసిన సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు , అంతేకాకుండా సొంత ఇంటి కలను నెరవేర్చి కార్మిక కుల, కలను,నిజం చేయాలన్నారు, ఇతర సమస్యలను కూడా యుద్ధప్రతిపాదికపై పరిష్కరించి సింగరేణి కార్మికులను ఆదుకోవాలని నర్సింగారావుకోరారు, అనంతరం ఆయన స్థానిక మేనేజర్ సుధీర్ కుమార్ ఝాకు, గుర్తింపు సంఘం నాయకులతో కార్మికులతో కలిసి డిమాండ్లు తో కూడిన వినతి పత్రం అందజేసి పరిష్కరించాలని కోరారు, ఈ కార్యక్రమంలో గని వైస్ ప్రెసిడెంట్ , గుర్తింపు సంఘం సీనియర్ నాయకులు,మ్యా డగొని, మల్లేష్, ఎలక్ట్రికల్ ఫోర్ మెన్, శేఖర్ రావు, మైనింగ్ ఫోర్ మెన్, సత్యనారాయణ, హెడ్ ఓవర్ మెన్ ప్రవీణ్, పి ట్టర్ వినోద్ ,ఏఐటీయూసీ సీనియర్ నాయకులు జిపి రావు, భోగ మధునయ్య, కొట్టే శ్రీకాంత్, మురళి, సంపత్ జడల శ్రీనివాస్, కుమార్ టెక్నీషియన్ లక్ష్మణస్వామి, కార్మికులు పాల్గొన్నారు