షాద్ నగర్ పట్టణ పరిసర గ్రామ ప్రజలకు తెలియ జేయునది!

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్/07/ ఫరూక్ నగర్,:రిపోర్టర్: కృష్ణ పవిత్ర మైన కార్తీక మాసంలో పంచారామాలను ఒకేరోజు దర్శించుకునేలా మన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చక్కటి ప్రణాళికతో మీ ముందుకు వచ్చింది. తేదీ: 09.11.2025 ఆదివారం సాయంత్రం 19.00(07.00) గంటలకు షాద్ నగర్ బస్టాండ్ నుండి సూపర్ లగ్జరీ బస్సులో బయలుదేరి తేది: 10.11.2025 సోమవారం రోజున బ్రహ్మ ముహూర్తానికి ముందే అమరావతి చేరుకుని, అక్కడ స్నానాదులు ముగించుకుని. ఉదయమే మొదటి దర్శనంగా అమరేశ్వర స్వామి దర్శించుకుని. నేరుగా భీమవరం చేరుకుని సోమేశ్వర స్వామిని దర్శించుకుని, తదుపరి పాలకొల్లు చేరుకుని క్షీర రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అటు నుండి ద్రాక్షారామం చేరుకుని భీమేశ్వర స్వామి దర్శించుకుని సామర్లకోట చేరుకుని 5వ దర్శనంగా చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామిని దర్శించుకుని . అదే రోజు రాత్రి అక్కడనుండి బయలుదేరి నేరుగా షాద్ నగర్ పట్టణానికి చేరుకుంటాం. ఇట్టి యాత్రకు ప్రతి ఒక్కరికి కేవలం 2300,/_ రూపాయలు టికెట్ గా నిర్ణయించడమైనది. మనం దర్శించుకునే పై ఐదు దేవస్థానంలలో కూడా మధ్యాహ్న భోజన ఏర్పాట్లు ఉంటాయి సమయాన్నిబట్టి ఏ దేవస్థానంలో వీలైతే ఆ దేవస్థానంలో మధ్యాహ్న భోజన కార్యక్రమం పూర్తి చేసుకోవచ్చు. ఇట్టి చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకొని శివ కటాక్షం పొందగలరని భక్తులకు తెలియపరుస్తూ. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు : 9959226287
9182645281 9440838985 9491166785 మీ డిపో మేనేజర్ *షాద్ నగర్.