సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో ముదిరాజుల కుల దైవమైన శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రధమ వార్షికోత్సవ సందర్భంగా భక్తులు వేల సంఖ్యలో హాజరయ్యారు. దమ్మన్నపేట గ్రామంలో ముదిరాజులు కుటుంబ సమేతంగా ధూప దీప నైవేద్యాలతో బోనాలను సమర్పించుకున్నారు. శ్రీ వనదుర్గ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమాలు మూడు రోజులుగా జరుపుకున్నట్లు దమ్మన్నపేట గ్రామం ముదిరాజ్ బంధువులు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులను పొందడానికి భక్తులు ఆలయ వార్షికోత్సవంలో భాగంగా హోమం, యజ్ఞం అన్న ప్రసాదం పలు కార్యక్రమాలలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అద్భుతమైన శ్రీవనదుర్గ పెద్దమ్మతల్లి అమ్మవారి కృపను పొందడానికి భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, కార్యకర్తలతో విచ్చేసి అమ్మవారి వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దమనపేట్ గ్రామ ప్రజలు ధర్పల్లి మండల్ బిజెపి అధ్యక్షులు జీరామైపాల్, బీజేవైఎం మండల అధ్యక్షులు దోర్నాల రాజశేఖర్, కర్క గంగారెడ్డి, తాళ్ల రాము, అచ్యుత్ రాజ్, చరిచంద్,సేవాలాల్, చిలుక నరేష్, శ్రీకాంత్, మరియు ముదిరాజ్ కుల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
