విద్యార్థులపై మొండి వైఖరి విడనాడాలి

★కళ్ళుండి విద్యార్థుల వైపు చూడలేని గుడ్డిది రాష్ట్ర ప్రభుత్వం. ★ఎస్. ఎఫ్. ఐ ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన తెలిపిన విద్యార్థులు. ★విద్యను రోడ్డుకీడ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ★ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రవీందర్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; స్థానిక ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చినా స్పందించని ప్రభుత్వం విద్యార్థులకు విసుకు చెంది ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మరియు విద్యార్థులు కలిసికట్టుగా భద్రాచలం అంబేద్కర్ సెంటర్ నందు అంబేద్కర్ కి వినతి పత్రం మరియు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కొప్పుల రవీందర్ మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం క్రూరంగా వ్యవహరిస్తున్నదని, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వారిని విద్యకు దూరం చేయాలని చూస్తున్నదని ఖజానాలో డబ్బులు లేవు అని బుకాయిస్తున్నదని విమర్శించ్చారు. 13 లక్షల మంది విద్యార్థుల ఫీజు పెండింగ్లో ఉండటం వలన వారి భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, డబ్బు లేదని డిప్యూటీ సీఎం చెప్పడం హస్యాస్వదం అని కొప్పుల రవీందర్ అన్నారు. ఒకపక్క ఒక్కో విద్యార్థికి 35000 చెల్లించవలసి ఉండగా గత రెండేళ్లుగా కొన్ని కోట్ల రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో బెస్ట్ అవైలబులి స్కీం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థుల భవిష్యత్తు ప్రైవేటు పాఠశాలలో ప్రశ్నార్థకంగా మారుతున్నదనీ ఆయన అన్నారు. మరోపక్క ఉపాధ్యాయులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో కాలేజీ యజమాన్యాలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్స్ స్కాలర్షిప్ కోసం ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం 12000 కోట్లు టోకెన్లు ఇచ్చింది కానీ దీపావళి నాటికి 300 కోట్లు మాత్రమే విడుదల చేసిన తన అలవాటుగా వాగ్దాన బంగానికి పాల్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ గత ఆరేళ్ల నుండి ప్రభుత్వం చెల్లించడం లేదు. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 8500 కోట్లు పైచిలుక బకాయిలను చెల్లించాలని లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇళ్లను మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చందు వర్ధన్,దినేష్. వివిధ కాలేజీ అధ్యాపక బృందాలు టీచింగ్ నాన్ టీచింగ్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.