సాక్షి డిజిటల్ న్యూస్ 7నవంబర్ 2025(జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం లోని గోపులాపూర్,యస్వంతరావుపేట్ గ్రామాలలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలను ధర్మపురి మార్కెట్ కమిటి చైర్మన్ చిలుముల లావణ్య లక్ష్మణ్,బుగ్గారం తహసీల్దార్ భూమేశ్వర్,ఏపీఎం రమాదేవి ప్రారంభించిన కార్యక్రమం లో పాల్గొన్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల సుభాష్. ఈ సందర్బంగా సుభాష్ మాట్లాడుతూ మాయిత్సర్ వచ్చిన వడ్లను ఎటువంటి కటింగ్ లేకుండా కొనాలని, ఎటువంటి సమస్యలు ఎదురైనా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులకు,రైతులకు సూచించారు.వారితో పాటు మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ రావు, అధికారులు, మాజీ సర్పంచులు రామారావు, సత్యనారాయణ రావు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, బీర్పూరి తిరుపతి, కండ్లె మదన్,బండారి మహేష్, సమీద్, గైని శ్రీను, ఐకేపీ సిబ్బంది,రైతులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.