రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టాలి

★సిపిఐ మండల కార్యదర్శి అంజనప్ప

సాక్షి డిజిటల్ న్యూస్ : 7 నవంబర్ 2025 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ బాబు ( రాము) రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండలం నందు సోంపల్లి గ్రామం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి అంజన్నప్ప మాట్లాడుతూ సోంపల్లి పాతకోట కస్పాలు రోడ్లు చాలా గుంతలు ఏర్పడ్డాయి ఉన్నాయి దాచెట్టు వారి పల్లికి 7మడకలపల్లికి పోయేటువంటి రోడ్డు మార్గం ఈ రోడ్డు మార్గంలో గుంతలు ఏర్పడి నీటి నిలువతో రోడ్డు చాలా అద్వానంగా తయారైనది రోడ్డుకి ఇరువైపులా డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తే బాగుపడతాది స్వతంత్రము వచ్చి 79 సంవత్సరాల గడుస్తున్న పేదల బతుకులు మారలేదు అన్నట్టు ప్రభుత్వాలు మారిన పేదల బతుకులు మారలేదు ప్రభుత్వాలు చెప్పే గొప్పలు అభివృద్ధిలో శూన్యమని భారత కమ్యూనిస్టు పార్టీగా అడుగుతున్నాం పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు చెప్పేటువంటి మాటలు నీటి మూటలుగా మిగులుతున్నాయి పంచాయతీల్లో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేక చదువుకునే విద్యార్థులు వాహనాలు రాకపోకలు ఇబ్బందులకు గురవుతున్నారు ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం రోడ్డు మరమ్మతులు చేపట్టి డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేసి అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపట్టాలని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో కస్పాలు నివాసితులైన కొంతమంది ప్రజలు పాల్గొన్నారు