మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలి

సాక్షి డిజిటల్ న్యూస్ ప్రతినిధి, దాసరి శ్రీనివాస్, నవంబర్ 7, 2025 తాండూర్ మండలంలోని అచ్చలాపూర్ గ్రామపంచాయతీని గురువారం రోజున జిల్లాపంచాయతీ అధికారులు డి. వెంకటేశ్వరరావు డిఎల్పిఓ సతీష్ కుమార్ లు ఆకస్మికంగా గ్రామపంచాయతీని తనీఖి చేశారు. అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించి, వాటర్ సప్లై రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, గ్రామపంచాయతీ పరిధిలోని రోడ్లు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం ఉండేలా చూడాలని, అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు లేకుండా చూసుకోవాలని, అలాగే గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఓపెన్ బావులలో బ్లీచింగ్ పౌడర్ తో క్లోరినేషన్ చేయించాలని సూచించారు. గ్రామపంచాయతీ నుండి సేకరిస్తున్న తడి మరియు పొడి చెత్తను వేరు చేసి, తడి చెత్తతో ఎరువు తయారు చేయాలని, పొడి చెత్తను రీసైక్లింగ్ యూనిట్ కు పంపే విధంగా ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు. తధనంతరం స్మశాన వాటికను సందర్శించి చుట్టూ ప్రక్కల ఎటువంటి పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మండల పంచాయతీ అధికారి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *