మూడు నెలల్లో దక్షిణ నియోజకవర్గం లో ఉన్న వెంకటేశ్వర మెట్ట దేవాదాయశాఖ భూముల సమస్య పరిష్కరిస్తానన

సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈరోజు జీవీఎంసీ 33వ వార్డు కుమ్మరి వీధిలో జనవాహిని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో విశాఖ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి మరియు జీవీఎంసీ 33 వ వార్డు క్లస్టర్ ఇంచార్జ్ శ్రీమతి తిరుమల దేవి చక్రవర్తి మరియు వెంకటేశ్వర మెట్ట హౌస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మివారం వెంకటేశ్వరమెట్ట సర్వే నెంబర్ లు 1261/1450 దేవాదాయశాఖ భాదితులు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ను కలిసి సుదీర్ఘకాలంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని మెమొరాండం సమర్పించడమైనది. ఈ సందర్భంగా వంశీకృష్ణను శాలువాతో సత్కరించారు.అనంతరం విల్లూరి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వంద సంవత్సరాలు పైగా నివాసితులుగా ఉన్న తమ దేవాదాయ ధర్మాదాయ శాఖ సమస్య పరిష్కారం కాలేదని ప్రస్తావించారని గుర్తుచేశారు. నియోజకవర్గంలో అతిపెద్ద సమస్యగా ఉన్న 22ఏ ల్యాండ్ సమస్య తో ప్రజలకు బ్యాంకు లోన్ సదుపాయం కానీ, ఇళ్లకు మరమ్మత్తులు చేసుకునే అవకాశం లేదని ఎమ్మెల్యే వంశీకృష్ణ అసెంబ్లీలో మరియు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో సుమారు 20 ఎకరాలు భూమి ఎండోమెంట్ భూములుగా చిత్రీకరించి స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. తమ సమస్యను అసెంబ్లీలో, డిఆర్సి మీటింగ్ లో కూడా ఎమ్మెల్యే వంశి ప్రస్తావించారని అయినప్పటికీ ఈ సమస్యకు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. స్థానికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారికి బ్యాంకు లోన్ సదుపాయం గానీ లేదా వారి ఇళ్ళను రిపేరు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని సభ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.దేవాదాయ శాఖకు 20 ఎకరాల భూమి వేరొక చోట కేటాయించినట్లయితే ఎటువంటి అభ్యంతరం లేదని ఎండోమెంట్ అధికారులు చెప్పిన సంగతి కూడా సభ దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు.ఎమ్మెల్యే వంశీ సారధ్యంలో త్వరలోనే తమ సమస్య పరిష్కారమవు తుందని ఘాడంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తమసమస్య పరిష్కరానికి విశేష కృషి చేస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు విల్లూరి డాక్టర్ చక్రవర్తి వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర మెట్ట హౌస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి శెట్టి శ్రీను, హానర్బల్ ప్రెసిడెంట్ శరగడం మోహన్రావు, హౌస్ వెల్ఫేర్ సభ్యులు కోరుబిల్లి త్రినాధ్,ఎల్లపు గోపాలరావు , సూరిశెట్టి చిట్టి నాయుడు ,సూరిశెట్టి శంకర్రావు ,వేగి వెంకట అప్పారావు (నారాయణ కాలేజ్) పీల రవి,పెంటకోట వెంకట , చిప్పాడా అప్పారావు , తనకాల గోవింద్ ,కోరిబిల్లి ఆది , పీలా రవి ,సింగంపల్లి మాధవి, పొట్నూరు మీనాక్షి, ఆర్ అరుణ, గందా సత్య, యశోద, బొడ్డేటి బిందు,బూబమ్మ,కిల్లో సురేష్,తదితరులు పాల్గొన్నారు