సాక్షి డిజిటల్ న్యూస్ జూలూరుపాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 6 రిపోర్టర్:షేక్ సమీర్ కొత్తగూడెం: స్టెట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారు అందిస్తున్న "ఆశ" స్కాలర్ షిప్ లను అర్హులైన ముస్లిం విధ్యార్దులు దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ. యాకూబ్ పాషా గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్దులకు రూ.15 వేలు, డిగ్రీ విద్యార్దులకు 75 వేలు, పీజీ విద్యార్దులకు 2,50,000, ఐఐటి విద్యార్దులకు 2లక్షలు, ఐఐఎం విద్యార్దులకు 5 లక్షలు, వైధ్య విధ్యార్దులకు 4,50,000 చొప్పున, విదేశాలలో చదువుతున్న వారికి 20 లక్షలు సంవత్సరానికి అందజేయటం జరుగుతుందన్నారు. విద్యార్దులు గత సంవత్సరంలో సాధించిన పరీక్షా ఫలితాల్లో 75 శాతం మార్కులు పొంది, కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల నుండి 6 లక్షల లోపు కలిగిన భారతీయ విద్యార్దులందరికి ఈ స్కాలర్షిప్ లు పొందటానికి అర్హులన్నారు. అర్హత, ఆసక్తి కల విద్యార్దులు ఈ నెల 15 వ తేదీ లోపు www.sbifashascholarship.org/ వెబ్ సైట్ నందు తమ మార్కుల జాబితా, ఆధార్, ఫీజులు చెల్లించిన రశీదు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం ఫోటోతో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్దిని, విద్యార్దులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాల కొరకు 8520860785, 8886934260, నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.