భద్రాచలం ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ సమావేశం

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 భద్రాచలం రిపోర్టర్ గడ్డం సుధాకర్ రావు; శ్రీ సీతారామ చాంబర్స్ కామర్స్ ఎన్నికల సందర్భంగా భద్రాచలం ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు విజ్జిగిరి రాజా కిరణ్, సభ్యులకు సభ్యత్వం కై కావలసిన పత్రాలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ నెల 13 తేదీన సభ్యత్వాలను పూర్తి చేసి శ్రీ సీతారామ చాంబర్స్ కామర్స్ వారికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొలిపాక నరసింహస్వామి, కోశాధికారి బూరి రాధాకృష్ణ, సభ్యులు విజయ్, దూది సతీష్, ఎస్.కే నజీర్, శివ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *