సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్.7 బి.కొత్తకోట రిపోర్టర్ చక్రపాణి అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలోని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బి కొత్తకోట పరిసర ప్రాంతాలలో కిడ్నీ రోగ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎక్కువమంది ఉన్నారని వారి సౌకర్యార్థం బి కొత్తకోట మండలం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బి కొత్తకోట బిజెపి నాయకులు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్ రెడ్డి బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డిఅన్నమయ్య జిల్లా బిజెపి అధ్యక్షులు సాయి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు వారు వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బి కొత్తకోట లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అనుమతులు తీసుకున్నారు. బి కొత్తకోట డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి తీసుకొచ్చిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి. జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్దన్ రెడ్డికి. బిజెపి సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డికి.బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్. బి.కొత్తకోట మండల బిజెపి అధ్యక్షులు ముకుంద. గోరంట్ల రమేష్. జనరల్ సెక్రెటరీ మురళి. ట్రెజరర్ సకల రాము. నాయకులు మగ్గాల రమణ. బీజేవైఎం నాయకులు బండి కార్తీక్ బాబు.ముబారక్ .లు సంయుక్తంగా హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.