బి. కింతాడలో శ్రమదాన కార్యక్రమం

సాక్షి డిజిటల్ న్యూస్ 7 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు, మండలంలోని బోయిల కింతాడ గ్రామంలో శ్రీ దుర్గాదేవి అమ్మవారి దేవాలయం వద్ద నుంచి సిమెంట్ రోడ్డుకి ఇరువైపులు గ్రామంలోకి వెళ్లే వరకు పెరిగిపోయిన చెట్లు, తుప్పలు, డొంకలను తొలగించి శుభ్రం చేశారు. మాడుగుల నియోజకవర్గం తెలుగు రైతు ఆర్గనైజింగ్ సెక్రటరీ కడిమి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం బి. కింతాడలో శ్రమదాన కార్యక్రమం జరిగింది. కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి దేవాలయానికి వచ్చిన భక్తులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాగేశ్వరావు శ్రమదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో గల్లా అప్పారావు, అచ్చం నాయుడు, బుగత శ్రీను, సియదల రాము, బుగత అప్పారావు, జి .రామారావు, ఈశ్వర రావు, చిట్టిబాల బంగారమ్మ, కడిమి చల్లయ్యమ్మ రైతులందరూ పాల్గొన్నారు.