సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ నారాయణపేట నియోజకవర్గ ఇంచార్జ్ క్రిష్ణ ధన్వాడ మరికల్ మండలాల్లో గ్రామ గ్రామాన కల్తీకల్లు జోరుగా కొనసాగుతున్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని నారాయణపేట జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు పి వెంకటేష్ ఆరోపించారు. గురువారం నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్తీ కళ్ళు తయారీలో మరికల్ అడ్డగా మారిందన్నారు. మరికల్ మండల కేంద్రంలోని మాదరం వెళ్లే రహదారిలో కల్తీకల్లు జోరుగా తయారు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. సంవత్సర కాలంలో ఏ ఒక్కరోజు కూడా కల్తీకల్లు పై ఎక్సైజ్ శాఖ అధికారులు పరిశీలించిన దాఖలు లేవని ఆయన ఆరోపించారు. కల్తీకల్లు సేవించి ప్రజలు అనారోగ్యకి గురవుతున్న అధికారులు చూసి చూడనట్లు వారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయచూర్ కి చెందిన ఒక వ్యక్తి పేట జిల్లా వ్యాప్తంగా కల్లు దుకాణాలను కొనసాగిస్తున్న పట్టించుకోవడం లేదన్నారు.గ్రామాలలో చిన్న వయసులోనే కల్లుకు బానిసలు అవుతున్నారని ఆయన ఆరోపించారు.అదేవిధంగా మద్యం బెల్టుషాపులు విచ్చలవిడిగా కొనసాగుతు న్నాయన్నారు ,బెల్టుషాపులు కల్తీకల్లు నివారించకపోతే సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.