ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన రోడ్లను పరిశీలిస్తున్న డి వై ఎఫ్ ఐనాయకులు

★రోడ్లకు తొందరగా మరమ్మతులు చేయాలి అని డిమాండ్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 నల్గొండ జిల్లా చిట్యాల మండలం రిపోర్టర్ డి నర్సింహ నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామం నుంచి మునుగోడు వరకు వెళ్లి రహదారి గుంటలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బంది కలుగుతుందని ఈ రోడ్డు వెంబడి వెలిమినేడు పిట్టంపల్లి వద్ద కెమికల్ కంపెనీలు ఉన్నాయి ఈ వాహనాలు వెళ్లే దారి వాహనాలు వెయిట్ ద్వారాద్వారా రోడ్డు మొత్తం గుంటలు ఏర్పడి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కొన్ని వేల కోట్లు పెట్టి కంపెనీలు ఏర్పాటు చేసుకొని కంపెనీలకు వెళ్లే వాహనాల ద్వారా రోడ్లు మొత్తం ఖరాబైపోతున్న పట్టించుకోని కంపెనీ యాజమాన్యాలు ప్రజలు ఇబ్బంది పడుతున్న చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు రోడ్లకు మరమ్మతులు చేయడం చూసి వదిలేస్తున్నారు దీనితోపాటు మరొక రహదారి వే లిమినేడు నుండి చిన్న కాపర్తికి వెళ్లి రహదారి వెంబడి దాదాపుగా 10 కెమికల్ కంపెనీలు ఉన్నాయి ఆ రహదారి కూడా గుంటలు గుంటలు ఏర్పడి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది తరచు అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి కంపెనీ యాజమాన్యలకు తెలియజేసిన చూసి చూడనట్టు వదిలేస్తున్నాయి కంపెనీలకు సంబంధించిన భారీ వాహనాలు తరచూ 20 . 30 టా న్నుల వేకిల్ వెళ్తాయి దీనివలన రోడ్లన్నీ చిందరమందరం అవుతున్నాయి అని కంపెనీ యాజమాన్యం చెప్పిన పట్టించుకోకుండా వదిలేస్తున్నాయి ఇకనైనా స్పందించి రోడ్లు త్వరగా పూర్తి చేయాలని అని డివైఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు కు నూరు గణేష్ హెచ్చరించారు లేనియెడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కూరాకుల బాలు గోలి సాయికిరణ్ గోలి సాయి విగ్నేష్ మెరుగు మల్ల సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు