సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 07: రిపోర్టర్ తిరుపతి, గురువారం రోజు ప్రభుత్వ జూనియర్ కాలేజీ, సిద్ధిపేటలో బాలురు మరియు బాలికలకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాంపల్లి గ్రామానికి చెందిన బాల మల్లయ్య విద్యార్థులతో మాట్లాడుతూ “హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సీపీ విజయ్ కుమార్ ఐపియస్ ఆదేశాల మేరకు నేను మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను” అని చెప్పారు.బాల మల్లయ్య మాట్లాడుతుండగా విద్యార్థులు శ్రద్ధగా వింటూ, ఆయన మాటలతో ఆకట్టుకుని, చప్పట్లతో ప్రాంగణం మార్మోగించడం గమనార్హం. ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు చట్టబద్ధంగా లైసెన్స్ పొంది మాత్రమే వాహనాలు నడపాలని సూచించారు.ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ “ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత. చిన్న తప్పిదం కూడా ప్రాణనష్టానికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి ట్రాఫిక్ రూల్స్‌ను గౌరవించి, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని” అన్నారు.ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారాయణ , ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ట్రాఫిక్ అధికారులు సూచించిన విధంగా ప్రతి విద్యార్థి కూడా రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని అన్నారు.