ప్రజల సమస్యల పరిష్కారానికి” పెంకి”వినూత్న ప్రయత్నం.అధికారులకు వేణు నాయుడు వినతులు.

పార్వతీపురం, నవంబర్ 7, సాక్షి డిజిటల్ (జి గోపాలరావు).. చిత్తశుద్ధి నిబద్ధత మరింత ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా ఓ పార్టీ నేతగా తన వంతు ఏమైనా చేయాలన్న తపనతో బలిజిపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పెంకి వేణుగోపాల్ నాయుడు వినూత్నంగా ఆలోచించి సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం వారు అధికారుల కార్యాలయాలు చుట్టూ తిరుగుతూ విసుగుచెంది నిరాశ పరిస్థితుల్లో ఉన్న స్థితిని గుర్తించి వారి తరఫున ఒకల్తా తీసుకొని మెజార్టీ ప్రజల ప్రధాన సమస్యలపై పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల సహకారంతో అధికారులను కలిసి సమస్యల పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేయడం అభినందనీయం. గురువారం మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల స్థాయిలో ప్రధానంగా ఉన్న భూ సమస్యలు, రెవెన్యూ పరమైన అంశాలను, పౌర సేవల్లో చోటు చేసుకుంటున్న జాప్యంపై హెచ్ డి టి ని కలిసి విన్నవించారు. ఎంపీడీవో కార్యాలయంలో గ్రామీణ అభివృద్ధి పారిశుద్ధ్య లోపం మౌలిక సదుపాయాల కొరత ప్రభుత్వ నుండి రావలసిన నిధులు మంజూరు పరిస్థితిపై ఎంపీడీవో తో చర్చించి గ్రామాల్లో ఆయా సమస్యల పరిష్కారం కోసం వినిపించడం కనిపించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు తీరు చోటు చేసుకున్న లోటుపాట్ల మూలంగా ఉపాధి కూలీలు పడుతున్న అవస్థలు సకాలంలో బిల్లుల చెల్లింపు పై తీసుకోవాల్సిన చర్లపై సంబంధిత అధికారులను కలిసి విన్నవించడం కనిపించింది. మొత్తంగా వేణుగోపాల్ నాయుడు చేసిన ప్రయత్నం మండల ప్రజల సమస్యల పరిష్కారం కోసం దోహదపడుతున్నందున అన్ని వర్గాలు ఆమోదాన్ని తెలియజేయడంతో నూతన వినూత్న ప్రయత్నానికి తగు రీతిలో మద్దతు లభించిందని చెప్పొచ్చు. కార్యక్రమంలో మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.