పోర్టు కార్యదర్శి వేణు గోపాల్ సేవలు ప్రశంసనీయము

★డిప్యూటీ చైర్మన్ గా పదోన్నతి లభించడం అభినందనీయం ★విశాఖ పోర్టు సలహా మండలి కమిటీ మాజీ సభ్యులు గంట్ల

సాక్షి డిజిటల్స్ విశాఖ ప్రతినిధి సంజయ్ విశాఖ పోర్టు ట్రస్ట్ ( అథారిటీ) కార్యదర్శిగా టి.వేణుగోపాల్ అందించిన సేవలు ప్రశంసనీయమని పోర్ట్ ట్రస్ట్ సలహా మండలి మాజీ సభ్యులు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ..డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. పారాదీప్ డిప్యూటీ చైర్మన్ గా పదోన్నతి పొందిన వేణు గోపాల్ ను గురువారం గంట్ల శ్రీనుబాబు ఆయన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలుసుకుని ఘనంగా సత్కరించారు.. డి ఎల్ బి నుంచి పోర్ట్ లో విలీనమైన పలువురు కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో వేణుగోపాల్ ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు.. అలాగే కాండ్లా పోర్ట్ లో కూడా అక్కడ కార్మికుల పెండింగ్ సమస్యలను గతంలో వేణుగోపాల్ సమర్ధవంతంగా పరిష్కరించారున్నారు. పోర్టు అభివృద్ధికి వేణుగోపాల్ శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. డిప్యూటీ చైర్మన్ గా పదోన్నతి పొంది పారదీప్ కు బదిలీపై వెళ్తున్న వేణు గోపాల్ ను ఈ సందర్భంగా గంట్ల శ్రీనుబాబు అభినందించారు.. భవిష్యత్తులో విశాఖ పోర్టు చైర్మన్ గా నియమితులు కావాలని గంట్ల శ్రీనుబాబు ఆకాంక్షించారు