సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7, ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ పి.డి.ఎస్.యూ ఆర్మూర్ డివిజన్ మహాసభ ధర్పల్లి పట్టణ కేంద్రంలో జరిగిన సందర్భంగా నూతన కమిటీ ఎన్నిక, ఆర్మూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు గా కామ్రేడ్ హుస్సేన్, రాహుల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని పి.డి.ఎస్.యూ రాష్ట్ర నాయకులు ప్రిన్స్ తెలిపారు ఆర్మూర్ డివిజన్ ఉపాధ్యక్షులుగా ఎం.రాజేష్, సహాయ కార్యదర్శి గా జీ.గణేష్, కోశాధికారి గా కళ్యాణ్ ,కార్యవర్గ సభ్యులుగా కీర్తన, సాయికుమార్,వినయ్, హనుమంత్, అక్షయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ సర్కార్ విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని గురుకుల పాఠశాలలు నిత్యం విద్యార్థి మరణాల కేంద్రంగా తయారవుతున్న ఏమాత్రం పట్టించుకోవడంలేదని , రెగ్యులర్గా ఫుడ్ పాయిజన్ అనేకమంది విద్యార్థులు రాష్ట్రంలో అస్వస్థత గురైన ఏ ఒక్కరోజు ప్రభుత్వ పెద్దలు పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తపరిచారు విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక నామమాత్రపు నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు వంద రోజుల్లోనే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తానని చెప్పి అట్టక్కెక్కించారని, ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల కాక విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షాలాగా మారిందన్నారు ప్రభుత్వ యూనివర్సిటీలను పటిష్టం చేయకుండా ప్రైవేటు యూనివర్సిటీల కోసం వెంపర్లాడడం ఏమాత్రం సరైనది కాదని వెంటనే ప్రభుత్వ విద్యను పటిష్టపరిచి పేద విద్యార్థులందరికీ ఉచితమైన నాణ్యమైన అందించాలని లేనిపక్షంలో రానా రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. మరియు విద్యరంగ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్న విద్యావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆర్మూర్ డివిజన్ లో బలమైన విద్యార్థి ఉద్యమాలను చేపడతామని పేర్కొన్నారు.