పాలిటెక్నిక్ కళాశాల తరలింపును ఉపసంహరించుకోవాలి

★గిరిజన విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకోం ★మాజీ జడ్పిటిసి పాల్వంచ దుర్గా

సాక్షి డిజిల్ న్యూస్ అక్టోబర్ 6 మణుగూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రిపోర్టర్ కొర్లపాటి రాజేష్ ఖన్న: మణుగూరు లోని జి.ఎం.ఆర్ పాలిటెక్నిక్ కళాశాల ను వచ్చే విద్యా సంవత్సరం కృష్ణసాగర్ అడవి ప్రాంతానికి తరలించేందుకు ప్రయ త్నాలు జరుగుతున్నాయని, మాజీ జడ్పి టిసి పాల్వంచ దుర్గ ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనకకు తీసుకోవాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారికి, రాష్ట్ర సాంకేతిక విద్యా కమిషనర్ కి, ముఖ్య మంత్రి కార్యాలయానికి, విద్యాశాఖ మంత్రి, గవర్నర్ కు వినతి పత్రాలు అందజేసినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా దుర్గ విలేకరులతో మాట్లాడారు. కళాశాలలో తరలిస్తే విద్యార్థులకు దూరాభారం అవుతుందని, గ్రామీణ విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందన్నారు. ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడం కోసం ఏర్పాటుచేసిన కళాశాలతో విద్యార్థులకు సింగరేణి, బి టిపిఎ స్, వంటి సంస్థల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ లాంటి అవకా శాలు సమృద్ధిగా లభిస్తున్నాయన్నారు. కానీ కాలేజీని అడవి ప్రాంతానికి తరలిం చడం విద్యార్థుల భవిష్యత్తును అంధకా రంలోకి నెట్టుతుందన్నారు. సరైన రవా ణా,ఇంటర్నెట్, మొబైల్ సిగ్నల్, వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం విద్యార్థిని లకు రాత్రి వేళలో భద్రతా సమస్యలు తలెత్తుతయన్నారు. మరో వైపు పరిశ్రమల దూరం వలన ప్రాక్టికల్ శిక్షణకు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటరన్నారు. బీటిపిఎస్ పరిశ్రమ నుండి రూ. 1.30 కోట్ల సిఎస్ఆర్ అభివృద్ధి నిధులతో ప్రారంభమైన కళాశాలను మరో మండలానికి తరలించి స్థానిక విద్యార్థులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోని హెచ్చరించారు. ఈ చర్య న్యాయ బద్ధం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యాశాఖ కళాశాల తరలింపు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మణుగూరులోనే కళా శాలను యధావిధిగా కొనసాగించేం దుకు చర్యలు తీసుకోవాలని, గిరిజన విద్యా ర్థుల భవిష్యత్తును కాపాడాలని అధి కారులకు విజ్ఞప్తి చేశారు.