తల్లాడ/నవంబర్ 06(సాక్షి డిజిటల్ న్యూస్ ) తెలంగాణ రైతు సంఘం సత్తుపల్లి డివిజన్ మహాసభ తల్లాడ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభ లో ముందుగా సీనియర్ నాయకులు సాయిని ప్రకాష్ రావు జెండా ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు ఈ మహాసభలో డివిజన్ అధ్యక్షులుగా నల్లమోతు మోహన్ రావు కార్యదర్శిగా రావుల రాజబాబు తో పాటు 17 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ మహాసభలో సత్తుపల్లి డివిజన్ నాయకులు సేలం పకీరమ్మ ముదిగొండ అంజయ్య మాదాల వెంకటేశ్వరరావు అర్వపల్లి గోపాలరావు అరవపల్లి జగన్ మోహన్ రావు కొత్త సత్యనారాయణ బాల బుచ్చయ్య పోర్టు రాజారావు తదితరులు పాల్గొన్నారు.