సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7, తుంగతుర్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి దస్తగీర్ తుంగతుర్తి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, తాసిల్దార్ దయానంద, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ క్రీడాకారులు ఒలంపిక్ జ్యోతిని వెలిగించారు. విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్, భారత నాట్యం నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులు భరతనాట్యం దుస్తులు ధరించి, విగ్నేశ్వరుని డీజే పాటలకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విద్యార్థినీలు డ్యాన్సులు ప్రదర్శించారు. బతుకమ్మ, బోనాలు, సమ్మక్క సారక్క పండుగల విశిష్టతను వివరిస్తూ విద్యార్థినీలు నృత్యాలు చేశారు. అక్కడికి వచ్చిన అతిథులకు, క్రీడా పోటీలకు వచ్చిన వారంతా నృత్య ప్రదర్శను తిలకించి ఆనందించారు. జోనల్ ఆఫీసర్ అరుణకుమారి మాట్లాడుతూ తుంగతుర్తి లో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో కూడా జోనల్ స్పోర్ట్స్ నిర్వహించుకోవడం జరిగిందని రెండోసారి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో మరోసారి ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తుంగతుర్తి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినీలు నేషనల్ స్పోర్ట్స్ లో స్థానం కల్పించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ కు వచ్చిన ముఖ్య అతిధులు అందరూ సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాసిల్దార్ దయానందం మాట్లాడుతూ 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొంటున్న 765 మంది విద్యార్థులు పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. తుంగతుర్తి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినిలు నేషనల్ స్థాయిలో రాష్ట్రస్థాయిలో రాణించడం చాలా ఆనందంగా ఉందన్నారు. చదువులతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ సాధించి నేషనల్ రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మాట్లాడుతూ తుంగతుర్తి మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినీలు ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. నీట్ ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ నేషనల్ రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభ చూపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సహకారంతో 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనడానికి వచ్చిన విద్యార్థినిలు అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ క్రీడా స్ఫూర్తిని తీసుకొని గెలుపు ఓటములు సహజమేనని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. 12వ జోనల్ స్పోర్ట్స్ మీట్ వరకు ఎమ్మెల్యే మందుల సామిల్ సహకారంతో క్రీడా మైదానంలో స్టేజ్ ఏర్పాటు చేయిస్తామన్నారు. క్రీడలకు సంబంధించిన మైదానంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో వచ్చే క్రీడల నాటికి ప్లే గ్రౌండ్ కు సంబంధించిన అన్ని వసతులు కల్పించి మెరుగైన మైదానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. తుంగతుర్తి సీఐ నరసింహారావు మాట్లాడుతూ నేను గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థినేనని విద్యార్థినిలు మంచిగా చదువుకొని క్రీడలలోనూ రాష్ట్ర స్థాయి నేషనల్ స్థాయిలో ఆటలలో పాల్గొని గురుకులాలకు మంచి పేరు తెస్తూ ఉన్నత శిఖరాలను అధిరో హించాలని అమ్మానాన్నల ఆశించిన స్థాయిలో ఎదిగి ఉన్నత స్థానంలో నిలవాలన్నారు. 11వ జోనల్ స్పోర్ట్స్ మీట్లో 765 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 19 మంది పిడి,పిటిలు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట, భువనగిరి,జనగాం జిల్లాల నుండి విద్యార్థినిలు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ నరసింహ రావు, ఎస్సై క్రాంతి కుమార్, గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు,ఉపాధ్యాయురాలు, విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.