టీడీపీ గ్రామశాఖ కమిటీలు ఎన్నిక

సాక్షి డిజిటల్ న్యూస్ 6 నవంబర్ 2025 దేవరాపల్లి రిపోర్టర్ రాజు మండలంలోని తామరబ్బ, చింతలపూడి పంచాయతీల్లో తెలుగు దేశం తరుపున నూతన కమిటీలను ఎన్నుకున్నామని ఆ పంచాయతీ టీడీపీ గ్రామశాఖ పూర్వ అధ్యక్షుడు ముక్కు ఈశ్వరరావు తెలిపారు. తమ పంచాయతీల పరిధిలోని అన్ని శివారు గ్రామాలకు చెందిన టీడీపీ శ్రేణుల సమక్షంలో ఈ ఎన్నిక జరిగిందన్నారు. తామరబ్బ గ్రామశాఖ నూతన అధ్యక్షుడిగా జడ్డేటి రమణమూర్తి, ప్రధాన కార్యదర్శిగా మొసలి దేముళ్లు, ఉపాధ్యక్షులుగా తొత్తడి మహేష్, కోశాధికారిగా ఇంటి దేముడమ్మని ఎన్నుకున్నామన్నారు. చింతలపూడి గ్రామ శాఖ అధ్యక్షులు దాయిరి దేముడు, ఉపాధ్యక్షులు ములగమ్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి కొమ్ము శంకరరావు, కోశాధికారి నంది దేముడు వారితో పాటు కార్యనిర్వాహక కార్యదర్శులు, కార్యదర్శులు, బూత్ కమిటీ సభ్యుల్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. నూతనంగా ఎన్నికైన తామరబ్బ, చింతలపూడి గ్రామశాఖ నూతన కమిటీలకు మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ అభినందనలు తెలిపారు.