జోహ్రాన్ మమ్దాని గెలుపు మానవాళికి ఆదర్శం

*భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐ ఎం సీనియర్ నాయకులు బూర్గుల ప్రభాకర్

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 తిరుమలగిరి మండల రిపోర్టర్ బాకీ శ్రీనివాస్ . తొండ తిరుమలగిరి మండల కేంద్రంలో పూలే అంబేడ్కర్ చౌరస్తాలో సీపీయం,ఎంసీపీఐ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ వామపక్షాల ఆధ్వర్యంలో అమెరికా న్యూయార్క్ పట్టణంలో డెమొక్రటిక్ సోషలిస్ట్ అభ్యర్థిగా జోహ్రాన్ మమ్దాని అఖండ విజయాన్ని సాధించిన సందర్భంగా విజయోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకొని మమ్దాని గెలుపుకు సంఘీభావం తెలియజేశారు. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందనే సామ్రాజ్యవాదు లకు సమాధానంగా మాక్సిజం లెని నిజమే ప్రపంచ మానవాళికి మార్గదర్శకం అని మమ్దాని గెలుపు ద్వారా రుజువైందని వారు తెలిపారు. అలాగే ఈరోజు ప్రపంచంలో పెట్టుబడిదారీ వర్గం ఆర్థిక సంక్షోభంలో పడిన నేపథ్యంలో సామ్యవాదం మార్క్సిజం లెనినిజం కమ్యూనిజం భావవ్యాప్తి ప్రపంచానికి ఒక దిక్సూచిగా మారిందని అన్నారు. నేడు నేపాల్ లో కూడా ఎనిమిది కమ్యూనిస్టు పార్టీలు ఐక్యంగా ఏర్పడి రేపు జరగబోయేటువంటి నేపాల్ ఎన్నికల సమరంలో ఐక్యంగా సామ్రాజ్యవాదాన్ని పెట్టుబడిదారి వర్గాన్ని ఓడించేందుకు ముందుకు సాగుతున్న విషయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని తెలిపారు. అంతేకాదు మన దేశంలో గత మూడు విడతలుగా జోహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అఖండ విజయం సాధించిన తీరు కూడా భారత దేశంలో మరో జన్ జెడ్ ఉద్యమం ప్రారంభ సూచనగా ఆయన అభివర్ణించారు. కాబట్టి భారత ప్రజలందరూ ప్రజాస్వామికవాదులు వామపక్ష కమ్యూనిస్టు కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో ప్రజా ఉద్యమాలలో పాల్గొనాలని ఎర్రజెండా లక్ష్యాన్ని అమరవీరుల ఆశయాల సాధనలో ముందుకు సాగాలని ఆ దిశగా ఈ దేశాన్ని నడిపించడంలో యువతీ యువకులు ప్రధాన పాత్ర పోషించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎం సి పి ఐ యు డివిజన్ నాయకులు నలుగురు రమేష్, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ తుంగతుర్తి డివిజన్ ప్రధాన కార్యదర్శి పేర్ల నాగయ్య పూర్వ కమ్యూనిస్టు నాయకులు సామాజిక ఉద్యమకారులు కొత్తగట్టు మల్లయ్య, చేయను శ్రీనివాస్ , కమ్యూనిస్టు అభిమానులు కందుకూరి ప్రవీణ్ , బీసీ సంఘం నాయకులు తన్నీరు రాంప్రభూ, ఎమ్మార్పీఎస్ మాల మహానాడు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *