జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

సాక్షి డిజిటల్ న్యూస్: కారేపల్లి,నవంబర్ 7.ఈవీఎంలు గట్టిగా నొక్కండి ఆ మోత జూబ్లీహిల్స్ మొత్తం వినబడాలి సోనియా, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి లకు యాక్టర్ సుమన్, ధన్యవాదాలు నవీన్ యాదవ్ యువకుడు సేవా నీరతి కలిగిన వ్యక్తి అన్న సుమన్, నవీన్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలన్న సుమన్,ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని సినీ నటుడు సుమన్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఓటర్లను అభ్యర్థించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తన మద్దతు ఉంటుందని ప్రముఖ తెలుగు సినీ నటుడు సుమన్ ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినందుకు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నవీన్ యాదవ్ యువకుడని సేవ నిరతి కలిగిన వ్యక్తి అని యాక్టర్ సుమన్, కొనియాడారు. ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాలని పులుపునిచ్చారు. ఈ ఉప ఎన్నికలో తన మద్దతు నవీన్ కు ఎప్పుడు ఉంటుందని ఆయనను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. "ఆల్ ది బెస్ట్ నవీన్ టేక్ కేర్" అని ఆయన ముగించారు. యూసఫ్ గూడా రెహమత్ నగర్ తదితర ప్రాంతాలలో చిన్న శ్రీశైలం యాదవ్ పేరు సుపరిచితం ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ రాజకీయాలతో పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు ఖైరతాబాద్ కూకట్పల్లి నియోజకవర్గం ఆయన ప్రభావం చూపేవారు. అయితే ఆయన అన్ని పార్టీలకు సమదూరం పాటించేవారు. అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు