సాక్షి డిజిటల్ న్యూస్,కారేపల్లి (నవంబర్ 6) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దే విజయం అని సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి,ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సూచనల మేరకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ బోరబండ, నందానగర్, ఎర్రగడ్డ, యూసుఫ్ గూడ, రహమత్ నగర్, శ్రీనగర్ కాలనీలో ఇంటింటా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే నవీన్ యాదవ్ విజయానికి నాంది అన్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరి నోట విన్నా..నవీన్ యాదవ్ దే విజయం అనటం ప్రశాంష నీయమన్నారు. నవీన్ యాదవ్ ప్రచారానికి ప్రజలు భ్రమరధం పట్టడం స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బానోత్ హీరాలాల్,గుగులోత్ భీముడు నాయక్, గుగులోత్ బాబు నాయక్, అజ్మీరా ఈర్య నాయక్, మాలోత్ బావు సింగ్ నాయక్,షేక్. షఫీ, షేక్ జానీ, తదితరులు పాల్గొన్నారు.
