జూబ్లీహిల్స్ లోనవీన్ యాదవ్ దే “విజయం”

★ఖమ్మం జిల్లా అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు,డిసిసిబి డైరెక్టర్ కామేపల్లి మేకల మల్లిబాబు యాదవ్

సాక్షి డిజిటల్ న్యూస్, కామేపల్లి (నవంబర్ 6) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దే విజయం అని ఖమ్మం జిల్లా అఖిలభారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి,ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచనల మేరకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ బోరబండ, నందానగర్,ఎర్రగడ్డ,యూసుఫ్ గూడ,రహమత్ నగర్,శ్రీనగర్ కాలనీలో ఇంటింటా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే నవీన్ యాదవ్ విజయానికి నాంది అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరి నోట విన్నా..నవీన్ యాదవ్ దే విజయం అనటం ప్రశాంషనీయమన్నారు.నవీన్ యాదవ్ ప్రచారానికి ప్రజలు భ్రమరధం పట్టడం స్ఫూర్తిదాయక మన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ యశ్వంత్ చారి,హేమంత్ అజ్జు, మోరియా,డేగల రాజు యాదవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నక్క మహేష్,తేలు పద్మ,పుట్ట ఉపేందర్, చిలకల వెంకటేశ్వర్లు యాదవ్, రామకృష్ణ బన్నీ యాదవ్, చెన్ను వెంకటరమణ, పల్లెబోయిన శ్రీనివాస్ యాదవ్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.