జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 బలిజ పేట మండల రిపోర్టర్ మురళి మండలంలో అరసాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పి. వినీత జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు పి ఈశ్వరరావు వ్యాయామ ఉపాధ్యాయులు పి బాలకృష్ణ తెలియజేశారు ఇటీవల జరిగిన మండల డివిజన్ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ చూపి రాష్ట్ర జట్టుకు ఎంపికైన వినీత శుక్రవారం నుండి సోమవారం వరకు కొవ్వూరులో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపినందుకు జాతీయ స్థాయి పోటీలకు జట్టులో స్థానం సంపాదించినట్లు తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వినీతను అభినందించారు జాతీయ జట్టుకు ఎంపికైన వినీత మాట్లాడుతూ చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏడాది నుండి పాఠశాల సమయానికి ముందు తరువాత పూర్వపు వ్యాయామ ఉపాధ్యాయులు గణపతి మాస్టారు ప్రస్తుత వ్యాయామం ఉపాధ్యాయులు బాలకృష్ణ మాస్టారు ఆటలో శిక్షణ ఇచ్చారని వారి సూచనలు మేరకు ఆటలో మెలకువలు నేర్చుకొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలియజేసింది విజయానికి దోహదపడిన ఉపాధ్యాయులకు మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు