చౌడువాడ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు వ్యాఖ్యలపై వైయస్సార్ నేతల ధ్వజం

★ప్రజల అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి నేడు క్రెడిట్ కోసం మాటలతో మాయచేస్తున్నాడు — వైస్ ఎంపీపీ సూర్యనారాయణ ★వైయస్సార్ పాలనలో మంజూరైన సబ్స్టేషన్‌ను తెలుగుదేశం తమదిగా చూపించుకోవడం సిగ్గుచేటు: ఎంపీటీసీ రాజేష్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ వీధి రామారావు అనకాపల్లి రూరల్, నవంబర్ 7: కె కోటపాడు,చౌడువాడ పంచాయతీ అభివృద్ధి వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిందని కే కోటపాడు వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చౌడవాడ 33/11 విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభోత్సవ వేదికపై బుధవారం సర్పంచ్ దాడి ఎరుకునాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు స్థానిక రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. మండల వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఎంపీటీసీ రాజేష్ యువ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్న సమావేశంలో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సూర్యనారాయణ మాట్లాడుతూ చౌడవాడలో 33/11 సబ్స్టేషన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే మంజూరు అయింది. ఆ సమయంలో స్థలాభావం కారణంగా కొంత ఆలస్యం జరిగింది. కానీ అప్పటి సర్పంచ్ దాడి ఎరుకునాయుడు వైయస్సార్ పార్టీకి క్రెడిట్ వెళ్లిపోతుందనే భయంతోనే స్థలం ఇవ్వకుండా అడ్డుపడ్డాడు అని అన్నారు. ప్రజల అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలను ముందుపెట్టిన వ్యక్తి నేడు అదే పనిని తమదిగా చెప్పుకోవడం సిగ్గుచేటు అని సూర్యనారాయణ అన్నారు. అనంతరము ఎంపీటీసీ రాజేష్ మాట్లాడుతూ చౌడవాడ పంచాయతీ వైయస్సార్ పాలనలోనే పేదలకు ఇల్లులు, సచివాలయాలు, మారుమూల గ్రామాలకు బ్రిడ్జిలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, హాస్పటల్ అభివృద్ధికి నిధులు మంజూరు, సీసీ రోడ్లు, నీటి సదుపాయం, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి ఆగిపోయింది అని అన్నారు. ఇప్పుడు ఎరుకునాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించడమే” అని రాజేష్ ధ్వజమెత్తారు.
ఎరుకునాయుడు నిజంగా ప్రజా సేవకుడే అయితే పబ్లిక్ డిబేట్‌కు రావాలి. ప్రజల మధ్య ఓ బహిరంగ చర్చ ఏర్పాటు చేసి వైయస్సార్ పాలనలో జరిగిన అభివృద్ధి, తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి రెండూ చూపించి ప్రజల నిర్ణయం తీసుకుందాం. ఓడిపోయినట్లయితే ఆయన చెప్పినట్టుగా రాజకీయ సన్యాసం తీసుకోవాలి” అని ఎంపిటిసి, వైస్ ఎంపీపీ సవాల్ విసిరారు. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ ల దృష్టిలో పడాలనే ఉద్దేశంతో సర్పంచ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు అని అన్నారు. అభివృద్ధి పనులపై రాజకీయాలు ఆడే ప్రయత్నాలు ఇక ప్రజలు సహించరు” అని హెచ్చరించారు. త్వరలోనే పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంటి వద్ద కూర్చునే రోజులు వస్తాయని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఎంపీపీ ఎంపీటీసీలతో పాటుగా ఆకుల సాయి, రాపేటి మల్లు నాయుడు, రాజి శ్రీనివాసరావు, చల్ల సురేష్, కుంచ నగేష్, తనకల అప్ప ల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.