సాక్షి డిజిటల్ న్యూస్ 7నవంబర్ 2025 (జగిత్యాల జిల్లా ఇంచార్జ్) బోనగిరి మల్లారెడ్డి సైబర్ నేరాల పైన అవగాహన సదస్సు నిర్వహించిన గొల్లపల్లి ఎస్ ఐ ఎం కృష్ణ సాగర్ రెడ్డి సైబర్ జాగ్రూకత దివస్ సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ అవగాహన సదస్సులో ఎస్సై మాట్లాడుతూ సైబర్ క్రైమ్ జరుగు పలు విధాల గురించి తెలియజేస్తూ,సైబర్ క్రైమ్ అయిన తర్వాత తీసుకోవాల్సిన తనకు జాగ్రత్తలను,సూచనలను తెలియజేశారు.ఇటీవల కాలంలో క్రిప్టో కరెన్సీ,ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్,ఆన్లైన్ గేమింగ్,ఏ పి కే ఫైల్స్ ఫేక్ ఇన్సూరెన్స్,పార్ట్ టైం జాబ్స్,డీప్ ఫేక్ ఫొటోస్ అంటూ పలు విధాలుగా జరిగే సైబర్ నేరాల గురించి వివరిస్తూ,తగిన జాగ్రత్తలు మరియు సూచనలు తెలియజేశారు.ఒకవేళ సైబర్ నేరం జరిగినట్లయితే 1930 కు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కువచ్చి ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. ఇట్టి అవగాహన సదస్సు కు శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గ్రామస్తులు,మరియు పోలీస్ సిబ్బంది హాజరైనారు.