కొనుగోలు కేంద్రాలు తెరిచారు కొనుగోలు చేయడం మరిచారు

*అకాల వర్షాలతో నష్టపోతున్నాం… మా వడ్లు కొనండి సార్ *ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసి 20 రోజులు గడుస్తున్న కాంటాలు వేయడం లేదని రైతుల ఆవేదన

సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 7 తుంగతుర్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి దస్తగిర్, తుంగతుర్తి మండల కేంద్రంలో వాన కాలానికి సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం కొనుగోలను విస్మరించింది. పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వడ్లు పోసి 20 రోజులు గడుస్తున్న కాంటాలు వేయడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కళ్ళంలో పూసిన వడ్లు తడిసి మొలకెత్తాయని ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20 శాతం వరి కోతలు పూర్తికాగా ఐకెపి కేంద్రాలకు తరలించారు . తెరిచిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేక రైతులు తమ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. దీనితో మిల్లర్లు తేమ, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. ధర కింటా ఒక్కంటికి 300 నుంచి 500 రూపాయలు తగ్గించి ఇస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *