సాక్షి డిజిటల్ న్యూస్ నవంబర్ 07 యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రిపోర్టర్ ముషం శ్రీనివాస్ మోత్కూర్ మండలం లో మొంథా తుఫాన్ కారణంగా కురిసినటువంటి భారీ వర్షాలకు వరి పత్తి నీటిలో మునిగి నష్టం వాటిలింది ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకం దేశం మొత్తం అమలవుతున్న రాష్ట్రంలో అమలు చేయక, రైతులను ఆదుకోలేక చేతులెత్తేస్తున్న దివాలా కోర్ రేవంత్ రెడ్డి సర్కార్. మోత్కూర్ మండలంలోని పలు గ్రామాలలో చేతికొచ్చిన వరి, పత్తి పంటలు నేలకొరిగి చేతికి రాక దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారనీ. దాంతో అప్పులపాలై మనోవేదనకు గురి అయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ముందు చూపుతోనే రైతుల శ్రేయస్సు కొరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం. అటువంటి పథకాన్ని అమలు చేయకుండా రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై ఏమాత్రం అభిమానం ఉన్న రాష్ట్రంలో ఫసల్ భీమా యోజన పథకాన్ని పటిష్టంగా అమలు జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రైతులను నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే ఎకరానికి 50,000 చొప్పున నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని బిజెపి మోత్కూరు మండల పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముత్తురు బిజెపి మండల పార్టీ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, జిల్లా నాయకులు ఏను జితేందర్ రెడ్డి , భీముని తిరుమల్ రెడ్డి తదితరు పాల్గొనడం జరిగింది.