కుకునూరు పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనుతనిఖీ చేసిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

సాక్షి డిజిటల్ న్యూస్, నవంబర్ 07: కొండపాక, సిద్దిపేట జిల్లా లోని కొండపాక, కుకునూరు పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంట గదిలో ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారమే ఆలుగడ్డ టమాటా పప్పు, బిర్యాని రైస్ వండినట్లుగా వంట సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. ఆహార పదార్థాల నాణ్యత పరిశీలిస్తూ బిర్యాని మరియు కూరల్లో నాణ్యత పెంచాలని విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. పాఠశాలలో పిల్లల హాజరు బియ్యం వంట సరుకులు అందించాలని వంట ప్రక్రియను తనికి చెయ్యాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. పాఠశాల లోపల వరండాలో ఉండకుండా, బయట మైదానంలో ఆకులు లో శుభ్రంగా లేదని పాఠశాల ఇంత అపరిశుభ్రంగా ఉంటే ఏం డ్యూటీ చేస్తున్నారని ప్రిన్సిపల్ స్కావెంజర్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసి యాక్షన్ తీసుకోవాలని డి ఈ ఓ ను ఫోన్ ద్వారా ఆదేశించారు.కొండపాక మండల లోని తిమ్మారెడ్డి పల్లి లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మిక సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంట గదిలో బిర్యానీ, ఆలుగడ్డ టమాటా కూర చేసినట్లుగా వంట సిబ్బంది కలెక్టర్ కి తెలిపారు. పాఠశాలలో పిల్లల హాజరు బియ్యం వంట సరుకులు అందించాలని వంట ప్రక్రియను తనికి చెయ్యాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. విద్యార్థులకు భోజనం, చదువు విషయంలో ఎలాంటి లోటు కలగకుండా చూసుకోవాలి. విద్యార్థులతో భోజన ప్రక్రియను పరిశీలిస్తూ అన్నo, కూర వదలకుండా తినాలని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని సూచించారు. ఈ వయసులో బాగా తినాలని శారీరకంగా దృఢంగా ఉంటేనే మానసిక ఆరోగ్యం గా ఉంటారని తెలిపారు.అనంతరం ప్రాంగణంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం అందించాలని బాలింతలకు, పిల్లలకు అందించాల్సిన భోజనం, స్నాక్స్, బాలమృతం ఇతరత్ర అన్ని వసతులు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు.